జంక్ ఫుడ్ ను చాలా ఎక్కువగా తీసుకోవడం, పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, ధూమపానం ఇంకా నోటిలో ఇన్పెక్షన్స్ వంటి వివిధ కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి.చాలా మంది కూడా పసుపు దంతాల కారణంగా నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతారు. ఇంకా సరిగ్గా నవ్వలేకపోతారు. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎలాంటి ఫలితం లేకపోవడంతో చాలా మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఇప్పుడు చెప్పే టిప్ ని పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం ముందుగా లవంగాల పొడిని, ఆలివ్ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ లవంగాల పొడిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఆలివ్ నూనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ తో దంతాలను 2 నిమిషాల పాటు రుద్దాలి. తరువాత గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా మీరు రెండు రోజులకొకసారి చేయడం వల్ల మీ దంతాలు క్రమంగా తెల్లగా మారతాయి. లవంగాలల్లో అలాగే ఆలివ్ నూనెలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఈ టిప్ ని వాడడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో పాటు చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.దంతాలు పసుపు రంగులో ఉన్న వారు ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. దంత సమస్యలని ఈజీగా తగ్గించుకోండి. ఈ టిప్ వాడితే ఎలాంటి దంత సమస్యలు రానే రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: