మనలో చాలా మంది కూడా వయసుతో సంబంధం లేకుండా మొటిముల, మచ్చలు ఇంకా ముఖంపై జిడ్డు వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అయితే మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యలు తలెత్తడానికి ముఖ్య కారణాలని చెప్పవచ్చు.మొటిమలు, మచ్చల వల్ల ముఖం జీవం కోల్పోయినట్టు కనిపిస్తుంది. చాలా మంది వీటి వల్ల ఆత్మనూన్యత భావనకు కూడా గురి అవుతూ ఉంటారు. ఈ సమస్యల నుండి బయట పడడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు.అందుకోసం బ్యూటీ పార్లర్ కు వెళ్తూ ఉంటారు.ఇంకా మార్కెట్ లో లభించే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినా కానీ కొందరిలో ఎటువంటి మార్పు కనిపించదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే సూపర్ చిట్కాను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్ ని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ చిట్కాను తయారు చేసుకుని వాడుకోవచ్చు.


ఈ టిప్ ని వాడడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని ఎంతో అందంగా మార్చే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి.ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క టమాట రసాన్ని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే దాకా అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొటిమలు ఇంకా మచ్చలు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి.అలాగే ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. ఇంకా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై మొటిముల, మచ్చలు, జిడ్డు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: