మనలో చాలా మంది కూడా చాలా రకాల జట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు జోజోబా నూనెను రాయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.జోజోబా నూనె మనకు ఆన్ లైన్ లో కూడా  లభిస్తుంది.దీనిని జుట్టుకి రాసి మర్దనా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మన జుట్టుకు జోజోబా నూనె చాలా మేలు చేస్తుంది. ఈ నూనెలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి.ఈ నూనె సహజ సిద్దమైనది కాబట్టి దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మన జుట్టుకు జోజోబా నూనెను రాయడం వల్ల జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. ఇది జుట్టుకు మంచి కండిష్నర్ గా పని చేస్తుంది. ఈ నూనెను రాయడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఇంకా పొడవుగా పెరిగేలా చేయడంలో ఈ నూనె మనకు బాగా సహాయపడుతుంది. ఈ నూనెను రాయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా, మృదువుగా ఇంకా కాంతివంతంగా తయారువుతుంది.ఇంకా అలాగే ఈ నూనెను రాయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.


తల చర్మం తేమగా ఉంచి చుండ్రు సమస్య మన దరి చేరకుండా చేయడంలో ఇంకా అలాగే తలలో దురద వంటి ఇన్పెక్షన్ లను తగ్గించడంలో జోజోబా నూనె మనకు బాగా సహాయపడుతుంది.ఈ నూనెను తలకు రాయడం వల్ల తలలో పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జుట్టు చివర్లు చిట్లడం ఇంకా జుట్టు ఎక్కువగా చిక్కుబడడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జోజోబా నూనెను నేరుగా జుట్టుకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇతర నూనెలతో కలిపి కూడా జుట్టుకు పట్టించవచ్చు.ఒక జార్ లో జోజోబా నూనె, అరటిపండు ఇంకా షియా బటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా ఈ విధంగా వాడినా కూడా జోజోబా నూనె మన జుట్టు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా జోజోబా నూనె మన జుట్టుకు చాలా మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోయి జుట్టు అందంగా, నల్లగా, పొడవుగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: