డార్క్ సర్కిల్స్ అనేవి మనలో చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్యల్లో ఇది ఒకటి. ఒత్తిడి, మొబైల్ ఫోన్ ను అధికంగా చూడడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు ఇంకా అలాగే పలు రకాల మందుల వాడకం వంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి.ఇవి ఖచ్చితంగా మన అందాన్ని పాడు చేస్తాయి. ఇంకా చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ నల్లటి వలయాలను ఎలా వదిలించుకోవాలో తెలియక వాటిని మేకప్ తో కవర్ చేస్తుంటారు.కానీ ఇక ఆ అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని  పాటిస్తే వారం రోజుల్లో ఈజీగా నల్లటి వలయాలను పోగొట్టవచ్చు.ఇప్పుడు ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ని వేసుకోవాలి. ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, నాలుగు చుక్కలు విటమిన్ఆయిల్ వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక చివరిగా రెండు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె వేసి మరోసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇక ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ప్రతి రోజు నైట్ నిద్రించే ముందు కళ్ళకు ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు సాఫ్ట్ గా సర్కులర్ మోషన్ మసాజ్ చేసుకోవాలి.ఒక అరగంట తరువాత నీళ్లతో శుభ్రంగా చర్మాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు రోజుకు ఒకసారి  చేస్తే చాలా తక్కువ సమయంలోనే కళ్ళ చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు ఈజీగా మాయం అవుతాయి.ఇంకా మీ కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. కాబట్టి ఎవరైతే నల్లటి వలయాలు ఉన్నాయని బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: