మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఇప్పుడు చెప్పే విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మొటిమల సమస్యతో బాధపడే వారు ఈ నియమాలను పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. మొటిమలతో బాధపడే వారు ప్రతి రోజూ ఖచ్చితంగా 4 లీటర్ల నీటిని తాగాలి. ఇంకా రోజూ ఖచ్చితంగా రెండు సార్లు మలవిసర్జనకు వెళ్లాలి.ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనలో ఉన్న వ్యర్థాలు, విష పదార్థాలన్నీ ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే ముఖానికి కొబ్బరి నూనె లేదా మీగడను రాసుకోవాలి. ఇక ఇలా రాసుకున్న తరువాత ముఖానికి ఫేస్ స్టీమర్ తో ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజూ ఆవిరి పట్టుకోవడం వల్ల ముఖ చర్మంపై ఇంకా చర్మం లోపలి పొరల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు ఇంకా మృతకణాలు ఈజీగా తొలగిపోతాయి. ఇలా ఆవిరి పట్టుకుని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ముఖానికి మీరు మడ్ ప్యాక్ ను వేసుకోవాలి. నల్ల మట్టిని తీసుకుని దానిని బాగా దంచి పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మట్టిని జల్లెడ పట్టుకోవాలి.ఇక జల్లెడ పట్టగా వచ్చిన మెత్తటి మట్టిలో నీళ్లు పోసి కలిపి నానబెట్టాలి. ఆ మట్టి చల్లగా అయిన తరువాత ఇందులో పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరే దాకా ఉంచాలి.


ఇలా చేయడం వల్ల మట్టిలో ఉండే చల్లదనం వల్ల చర్మం కూడా చల్లగా మారిపోతుంది. ఇంకా చల్లబడిన చర్మాన్ని తిరిగి వెచ్చగా మార్చడానికి చర్మానికి రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది.దీంతో చర్మకణాలకు కావల్సిన పోషణ అందడంతో పాటు మలినాలు కూడా ఈజీగా తొలగిపోతాయి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజూ చేయడంతో పాటు రోజూ 2 రకాల జ్యూస్ లను తాగాలి. ఉదయం పూట కూరగాయల జ్యూస్ ను ఖచ్చితంగా తీసుకోవాలి.ఇంకా అలాగే సాయంత్రం పండ్ల రసాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.  చాలా మంది మొటిమలను గిల్లడం, పిండడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు.ఇంకా అలాగే మొటిమలపై సబ్బుతో లేదా బాడీ వాష్ తో గట్టిగా రుద్దవద్దు. మొటిమలు ఉన్న భాగంలో చేత్తో నెమ్మదిగా శుభ్రం చేసుకుని ఆ తరువాత మెత్తటి వస్త్రంతో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మొటిమల సమస్య తగ్గు ముఖం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: