నేటి జీవనశైలి వల్ల జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను ఇంటి చిట్కాలతో చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య అనేవి చాలా మందిని ఎంతో వేదనకు గురి చేస్తున్నాయి.చాలా చిన్న వయస్సులోనే ఈ సమస్యలు రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో రకరాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉన్నారు. అయితే అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా ఈ టిప్స్ పాటిస్తే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు.ఈ టిప్స్ కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. గుప్పెడు కరివేపాకు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేయాలి.అలాగే ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి రసం తీసుకోవాలి. కరివేపాకు పేస్ట్ లో ఉల్లిపాయ రసం వేసి బాగా కలిపి పావుగంట పాటు అలా వదిలేయలి.


ఇక ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి.ఒక అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగు పరచటంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి నల్లగా మారేలా చేస్తుంది.ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. ఈ సల్ఫర్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా జుట్టు చాలా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.ఇంకా అలాగే తెల్లజుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే జుట్టుకు మంచి టోనర్ గా పనిచేస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలని ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: