జుట్టు రాలడానికి  చాలా కారణాలు ఉంటాయి. నిద్ర లేమి సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, మారిన లైఫ్ స్టైల్ విధానం, కొన్ని రకాల మందుల వాడకం ఇంకా హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఆకు ఆయిల్ ని వాడితే మాత్రం.. అవన్నీ చాలా ఈజీగా మాయం అవుతాయి. అదే రోజ్మేరీ. ఈ మొక్కలో చాలా పోషకాలు నిండి ఉంటాయి. పైగా ఈ ఆకులు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.ఈ రోజ్మరీ ఆయిల్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆయిల్ లో కార్నోసిక్ యాసిడ్ అనే పదార్థాం ఉంటుంది. ఇక ఈ పదార్థం.. చనిపోయిన కణాలను మళ్లీ పునరుజ్జీవింప చేస్తుంది. ఇది కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఈ రోజ్మేరీ ఆయిల్ చాలా మంచిది. ఇంకా ఆయుర్వేదంలో కూడా రోజ్మేరీ ఆయిల్ ని వివిధ రకాల సమస్యలకు ఔషధంలా ఉపయోగిస్తారు. జుట్టు బలంగా, దృఢంగా ఉంచడంలో ఈ ఆయిల్ చాలా బాగా సహాయ పడుతుంది. మరి ఈ ఆయిల్ ని ఎలా వాడాలి? ఎలా రాయడం వల్ల జుట్టు సమస్యల్ని ఈజీగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ రోజ్మేరీ ఆయిల్ ఇప్పుడు మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని అందులో 5, 6 చుక్కల రోజ్మేరీ ఆయిల్ ని కలపాలి. ఇక దీన్ని డబుల్ బాయిల్ మోడ్ లో వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించాలి. ఆ తర్వాత సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి. ఇలా  రాత్రి కానీ లేదా హెడ్ బాత్ చేసే గంట ముందు కూడా రాసుకోవచ్చు.ఈ హెయిర్ ఆయిల్ రాయడం వల్ల జుట్టు రాలడం, తెల్ల బడటం, ఇన్ ఫెక్షన్స్ ఇంకా చుండ్రు వంటి సమస్యలు తగ్గి పోతాయి. ఈ ఆయిల్ రాసిన కొద్ది రోజుల్లోనే జుట్టు చాలా సులభంగా ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది.కొన్ని రోజ్మేరీ ఆకులు, పుదీనా ఆకులను ఓ గ్లాస్ నీటిలో బాగా మరిగించాలి.ఇక ఇలా మరిగిన నీరు.. గోరు వెచ్చగా ఉన్నా లేక చల్లారిన తర్వాత ఓ బాటిల్ లో వేసి తలకు స్ప్రే చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ చాలా ఈజీగా మాయం అయిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: