ఇక చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు వచ్చేస్తాయి. మన చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు అయితే చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.అయితే వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. ఇక అదే తేనె.ఎందుకంటే తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది. ఈ తేనెలో ఎన్నో పోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు ఈ తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు.అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.చాలామంది కూడా తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.


తేనె మన చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని ఈజీగా రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె బాగా పని చేస్తుంది. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద ఇంకా మచ్చలు వస్తాయి.పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి. లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు ఈజీగా తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే తేనె మంచి ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు ఈజీగా పోయి ముఖం చాలా యవ్వనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: