చాలామందికి ముఖంపై మొటిమలు,మచ్చలు సర్వసాధారణమే.కానీ మృత కణాలు తొలగించడం మాత్రం చాలా ఇబ్బందితో కూడిన పని.కొంతమందిలో వైట్ హెడ్స్ ఎక్కువగా బాధపడుతూ ఉంటే మరి కొంతమందిలో బ్లాక్ హెడ్స్ ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి.ఇంక జిడ్డు చర్మం కలవారి సంగతి చెప్పనక్కర్లేదు.ఇలా వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ ఏర్పడడానికి కారణం మన శరీరంలోని కోలాజేన్ తగ్గిపోతూ ఉండడమే.ఈ కోలాజెన్ ఉత్పత్తి కోసం విటమిన్ సి కల ఆహారాలను తీసుకోవడంతో పాటు, విటమిన్ సి అధికంగా ఉన్న ఫేస్ ప్యాక్ లు వాడడం కూడా చాలా ముఖ్యం.ఇలాంటి ఫేస్ ప్యాక్ లలో ఆరెంజ్ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.అసలు ఆరెంజ్ తొక్కలతో వేసుకునే ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో,దానిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి..

సాధారణంగా ఆరెంజ్ లో విటమిన్ సి,మెగ్నీషియం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇంటిలో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మలినాలన్నీ తొలగి,ముఖం మెరుగ్గా తయారవుతుంది.

దీనీకోసం ముందుగా ఆరెంజ్ తొక్కలని తీసి,రెండు మూడు రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి.ఇవి బాగా ఎండిన తర్వాత మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి తీసుకుని,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ గంధం,ఒక స్పూన్ కలబంద గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి.ఈ ప్యాక్ వేసుకునే ముందు దాన్ని వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల మృతకణాలు క్రమంగా తగ్గిపోతాయి.మరియు మొటిమలు మచ్చలు,మంగు మచ్చలు వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.కావున మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.మరియు ఈ ప్యాక్ తో పాటు శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా సరే తగిన మోతాదులో నీరు తీసుకోవడం కూడా అందాన్ని రెట్టింపు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: