కొంతమందికి 25 సంవత్సరాలు వచ్చినప్పటికి గడ్డం, మీసాలు రావు. అందువల్ల పురుషులు చాలా ఇబ్బందికి, ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. ఇలా గడ్డం, మీసాలు రాకపోవడానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి.ఇక గడ్డం, మీసాలు రావడం అనేది  జన్యుపరంగా ఆధారపడి ఉంటాయి. ఇంకా అలాగే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల మీసాలు త్వరగా రావు. సాధారణంగా పురుషుల్లో అయితే 250 నుండి 950 నానో గ్రాముల మోతాదులో టెస్టోస్టిరాన్ ఉండాలి. అయితే కొంతమందిలో ఈ టెస్టోస్టిరాన్ ఉన్నప్పటికి అది గడ్డం, మీసాలు రావడానికి డైహైడ్రో టెస్టోస్టిరాన్ రూపంలోకి మారాలి.కానీ కొందరిలో అయితే ఈ రూపంలోకి టెస్టోస్టిరాన్ మారదు. అందువల్ల గడ్డం, మీసాలు రావు.ఇంకా అలాగే గడ్డం, మీసాలు వచ్చే భాగంలో హెయిర్ ఫోలికల్స్ సున్నింతంగా ఉండడం వల్లటెస్టోస్టిరాన్ ఉన్నప్పటికి కూడా గడ్డాలు, మీసాలు రావు. ఇంకా అలాగే అధిక బరువు కారణంగా చాలా మందిలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలనేవి వస్తూ ఉంటాయి. ఇలా సమస్యలు రావడం వల్ల కూడా చాలా మందిలో కూడా మీసాలు, గడ్డం సరిగ్గా రావడం లేదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీల్లలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ పురుషుల్లో ఎక్కువగా తయారవుతుంది.


అందువల్ల వారిలో మీసాలు, గడ్డాలు సరిగ్గా రావడం లేదు. మీసాలు, గడ్డాలు రావడానికి పురుషులు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే చాలా మంది కూడా మందంగా గడ్డాలు, మీసాలు రావడానికి షేవ్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఇక గడ్డాలు, మీసాలు ఎక్కువగా రావాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో మొలకలని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి చక్కగా ఉత్పత్తి అవుతాయి.ఇంకా అలాగే సాయంత్రం సమయాల్లో డ్రైనట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. నానబెట్టిన బాదంపప్పు, జీడిపప్పు ఇంకా వాల్ నట్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఈజీగా అందుతాయి.ఇంకా అలాగే మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరను కూడా తప్పకుండా తీసుకోవాలి.ఇక ఈ విధంగా డైట్ ను పాటించడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి గడ్డాలు, మీసాలనేవి చక్కగా వస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: