మనలో చాలా మంది కూడా ఎంతో అందంగా, తెల్లగా కనబడాలని  కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల వల్ల చర్మం నల్లగా మారిపోతుంది.అలాగే చర్మంపై మలినాలు, దుమ్ము ఎక్కువగా పేరుకుపోతున్నాయి. అందువల్ల ముఖం నల్లగా మారుతుంది. ఇంకా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ముఖం అందవిహీనంగా, ఇంకా కాంతిహీనంగా కనిపిస్తుంది. ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే చాలా రకాల ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్ ను వాడడం వల్ల ముఖం చాలా అందంగా తయారవుతుంది.పైగా ఈ ప్యాక్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇంకా అలాగే చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖానికి అందాన్ని, కాంతిని తీసుకు వచ్చే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇందు కోసం ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పంచదారను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దీనిని ఆరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, దుమ్ము ఇంకా మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా అలాగే చర్మంపై ఉండే నలుపు అంతా ఈజీగా తొలగిపోతుంది. చర్మం తిరిగి సాధారణ రంగుకు కూడా వస్తుంది. ఈ టిప్ ని వారానికి రెండుసార్లు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో వాడిన పంచదార స్క్రబర్ గా పని చేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను ఈజీగా తొలగిస్తుంది. అలాగే కలబంద చర్మానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మారుస్తుంది. ఈ విధంగా ఈ పేస్ ప్యాక్ ను వాడడం వల్ల చర్మం అందంగా, తెల్లగా ఇంకా చాలా కాంతివంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: