చాలా మంది కూడా జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు ఎదుగుదల ఆగిపోవడం వంటి చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు చాలా రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయినా కానీ ఎలాంటి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ ఒక్క చిట్కాను పాటించడం వల్ల ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.అవిసె గింజల జెల్ మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. మన జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే ఈ అవిసె గింజల జెల్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. దీని కోసం 50 గ్రాముల అవిసె గింజలను ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత పావు లీటర్ నీళ్లు పోసి నీటిని మరిగించాలి. నీరు మరిగే కొద్ది నీటిపై జెల్ ఏర్పడుతుంది. ఈ జెల్ ను వడకట్టి నేరుగా జుట్టు కుదళ్లకు, మాడు భాగానికి అంటేలా రాసుకోవాలి.


దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.అవిసె గింజల జెల్ ను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, సిలీనియం, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరచడంలో, జుట్టు పెరిగేలా చేయడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే జుట్టు ఊడిపోయిన స్థానంలో మరలా కొత్త వెంట్రుక రావడానికి 20 రోజుల సమయం పడుతుంది. అయితే అవిసె గింజల జెల్ ను వాడడం వల్ల జుట్టు ఊడిపోయిన స్థానంలో మరలా 10 నుండి 15 రోజుల్లోనే కొత్త జుట్టు వస్తుందని కూడా వారు చెబుతున్నారు.అవిసెగింజలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే అవిసె గింజలు మన జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: