పగిలిన పెదవుల వల్ల చలికాలంలో  చాలా మంది బాధపడుతూ ఉంటారు. చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం ఇంకా పెదవులను నాలుకతో తడపడం వంటి  కారణాల వల్ల పెదవులు పగులుతాయి.చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను ఇంకా లిప్ కేర్ లను వాడుతూ ఉంటారు.అలాగే వీటితో పాటు కొన్ని టిప్స్ వాడడం వల్ల కూడా పెదవులు పగలడం ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్స్ వాడడం వల్ల పెదవులు పొడిబారడం తగ్గి మృదువుగా, తేమగా ఇంకా అందంగా తయారవుతాయి. పెదవుల పగుళ్లను తగ్గించే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. అలాగే పెదవులకు నువ్వుల నూనెను కూడా రాసుకోవచ్చు. వేళ్లతో నువ్వుల నూనెను తీసుకుని పెదవులపై రాసి మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తగినంత తేమ లభించి పెదవుల పగుళ్లు తగ్గుతాయి.పెదవులకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెన్నలో పంచదార వేసి పెదవులపై నెమ్మదిగా రాస్తూ మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు, పొరలు తొలగిపోవడంతో పాటు పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే పెదవులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి. అలాగే పెదవులను మృదువుగా ఉంచడంలో తేనె కూడా మనకు సహాయపడుతుంది. కొద్దిగా తేనెను తీసుకుని పెదవులపై రాసి మసాజ్ చేయాలి.ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి. అలాగే పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.కలబంద గుజ్జును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెదవులపై కలబంద గుజ్జును రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి.ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు తేమగా ఉండడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: