మనలో చాలా మందికి కూడా చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక చలికాలంలో అయితే ఈ సమస్య ఖచ్చితంగా మరింత పెరుగుతుంది. ఈ బిజీ లైఫ్‌లో చుండ్రు తొలగింపుకు చాలా మంది కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అందువల్ల తలలో చుండ్రు, దురద ఎక్కువగా పెరుగుతోంది.చాలా మంది ఈ సమస్యని తగ్గించుకోవడానికి  షాంపులు వాడతారు. సెలూన్లకి వెళతారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


బేకింగ్ సోడా అనేది చుండ్రు సమస్యకు వన్ స్టాప్ సొల్యూషన్. ఇది స్కాల్ప్‌పై తేలికపాటి ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేసి మృతకణాలను ఈజీగా తొలగిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఇంకా దురదను తగ్గిస్తుంది. ఇంకా అలాగే బేకింగ్ సోడాలోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.బేకింగ్ సోడాను యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇది చుండ్రును నియంత్రించడంతో పాటు స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేయడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. వారానికి 2-3 రోజులు ఈ ట్రిక్ పాటిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడాను ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మందపాటి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి.


ఇక ఈ మిశ్రమంతో తలను స్క్రబ్ చేసుకోవాలి.ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య చాలా ఈజీగా పోతుంది.చుండ్రు సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా తలకు నూనె రాసుకోవాలి. ఎందుకంటే తలకు నూనె రాస్తే చుండ్రు దరి చేరదు. ఇంకా అలాగే చుండ్రు నివారణకు యాంటీ డాండ్రఫ్ షాంపూని ఉపయోగించవచ్చు. తలకు షాంపూ చేసేటప్పుడు స్కాల్ప్‌ను బాగా స్క్రబ్ చేయాలి. ఇది చుండ్రు సమస్యను చాలా ఈజీగా తగ్గిస్తుంది.మీరు తలకు బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు.కాబట్టి ఈ సులభమైన చిట్కాలు పాటించి చుండ్రు సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందండి. మీ జుట్టుని ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: