జుట్టు రాలడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది.దీన్ని కారణంగా చిన్న వయసులోనే చాలా మంది వయసు పై పడిన వారిలా కనిపిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య బాగా ఎక్కువై పోయింది. దీనికి కారణం సరైన తిండి నిద్ర లేకపోవడం, పోల్యూషన్.వీటి వల్ల ఎక్కువగా జుట్టు, చర్మం పాడావుతాయి.కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే పెరుగులో వేసి కొన్ని కలబంద ముక్కలు వేసి మెత్తగా రుబ్బి దీన్ని తలకి పెట్టడం వల్ల తలలో ఉన్న హీట్ తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది.
ఉసిరి కాయలు, శీకాకాయలు, కుంకుడుకాయలు ఇవి మన పెద్దల కాలం నుండి వాడుతున్నారు. అందుకే అప్పుడు ఆడవారికి పొడవైన జుట్టు ఉండేది. ఉసిరికాయల ముక్కలు కొబ్బరి నూనెలో రంగు మారే వరకు బాగా వేడి చేసి ఆ నూనెని తలకి బాగా పట్టించి ఒక అయిదు నిమిషాలు మసాజ్ చేయటం వల్ల జుట్టు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అవిసె గింజలలో జుట్టుని కాపాడే ఔషధాలు మెండుగా ఉన్నాయి. వీటిని మూడు కప్పులు తీసుకొని వాటిని ఒక కప్పు అవిసె గింజలు వేసి బాగా ఊడికించి కప్పు గ్లాసు నీళ్ళు వచ్చే వరకు బాగా మరగించాలి.అప్పుడు చిక్కని మిశ్రమంలా తయారవుతుంది.దీన్ని తలంతా బాగా పట్టించి గంట తరవాత తలస్నానం చేస్తే కురులు మృదువుగా తలతల లాడుతూ మెరుస్తాయి. ఈ టైప్ ట్రై చేస్తే నాలుగు వారాల్లోనే జుట్టు రాలడం ఆగి ఊడిన చోట కొత్త జుట్టు పుట్టుకొస్తుంది.
ఉల్లిగడ్డని ముక్కలగా చేసి వాటిని బాగా రుబ్బి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించడం వల్ల పొడవైన నల్లని ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.అలాగే ఒక చెంచా అముధం రెండు చెంచా లా కొబ్బరి నూనెలో కలిపి గోరు వెచ్చగా వేడి చేసి వారానికి మూడు సార్లు తలకి పట్టించి బాగా మర్దన చేయడం వల్లా అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: