ఇప్పుడు చెప్పబోయే టిప్ మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. చాలా మందిలో ఎండా, మొటిమలు, హార్మోన్ల మార్పులు, వివిధ కారణాల వల్ల ముఖంపై నల్లమచ్చలు, ముడతలు ఏర్పడుతుంటాయి.ప్రస్తుత ఆహారం, జీవనశైలి కూడా దీనికి కారణం కావచ్చు.చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి ఇప్పుడు చెప్పే అద్భుత ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది.ఈ ఉపయోగకరమైన ఫేస్ ప్యాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముడతలు లేని, స్పష్టమైన, మచ్చలు లేని చర్మం కావాలని కోరుకుంటున్న వారికి వేప ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ చాలా బాగా పని చేస్తుంది. ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై మొటిమలు ఈజీగా తగ్గుతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్లతో పాటు అనేక సమస్యలు కూడా తగ్గుతాయి.వేప ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ సూపర్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కొన్ని వేపాకులని తీసుకొని వాటిని నీళ్లతో బాగా రుబ్బుకోని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఇలా సిద్ధం చేసిన పేస్ట్‌లో కొంత పసుపు పొడిని మిక్స్ చేసి మీ ముఖానికి బాగా అప్లై చేయండి.దీన్ని దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు ఆరనివ్వండి.ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖంని శుభ్రంగా కడుక్కోవాలి.ఈ సూపర్ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలన్నింటి నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ముఖంపై నల్ల మచ్చలు, ముడతల సమస్యను తగ్గించుకోవడానికి మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ని ప్రయత్నించండి.ఖచ్చితంగా ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి.అయితే వేపతో మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, దానికి దూరంగా ఉండటం మంచిది.గుర్తుంచుకోండి.ఇక ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: