మనలో చాలా మంది కూడా ముఖం, జుట్టు సమస్యలతో ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మిరియాలు ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలుసు. అయితే కేవలం ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: