ఈ టిప్ పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్య చిటికెలో మాయం?

ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. దీనికి కారణం... జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు ఇంకా అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. అయితే ఉసిరితో జుట్టును చాలా ఈజీగా నల్లగా..రాలిపోకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఉసిరిలో విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్లు ఇంకా అలాగే ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉసిరిని ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.


ఇంకా అలాగే జుట్టు దృఢంగా మారుతుంది. అనేఎన్నో కారణాల వల్ల జుట్టు రంగుని కోల్పోతుంది. పోషకాహార లోపం, ఒత్తిడి ఇంకా నిద్రలేమి సమస్య వలన జుట్టు రంగు మారుతుంది. అయితే ఉసిరిని ఇలా ఉపయోగిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక బృంగరాజ్ నూనెలో ఆమ్లా పొడిని వేసి జుట్టుకి అప్లై చేస్తే జుట్టు రంగు మారుతుంది. అలాగే గోరింటాకుతో ఉసిరి పొడిని కలిపి జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. అలాగే ఒత్తుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.గూస్బెర్రీ పొడితో పాటు ఉసిరి పొడిని నీటిలో కలిపి జుట్టుకి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు రావడానికి ప్రధాన కారణం.. స్కాల్ప్ పొడిగా మారటమే.. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఉసిరి వాడండి. ఎందుకంటే స్కాల్ప్ కి ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దానివల్ల చుండ్రు సమస్య చాలా ఈజీగా తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: