మన వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతోపాటు చెడు ఆహారపు అలవాట్లు, రాత్రి ఆలస్యంగా తినడం, నిద్రపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఇంకా చెడు జీవన శైలి వంటి కారణాల వల్ల మన చర్మం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది.దీనివల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు ఈజీగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తమ చర్మ ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి హార్మోన్ల మార్పుల కారణంగా కూడా మొటిమలనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఆహారాల విషయంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.మనం ప్రతి రోజూ తినే ఆహారం మన ఆరోగ్యంపైనే కాకుండా మన చర్మంపై కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు మేలు చేస్తే.. కొన్ని మాత్రం ఖచ్చితంగా చాలా హాని చేస్తాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం మానేయాలి. ఇక చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


5 ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసే ఓ జ్యూస్‌ను తాగడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. పైగా ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలతోపాటు విటమిన్ కె, సి, ఎ చాలా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్ కొల్లాజెన్ ఏర్పడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కొల్లాజెన్ మన చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.పైగా ఇది కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. అందువల్ల చర్మ సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇక ఈ జ్యూస్‌ను తరచూ తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి.ఇక మీరు ఈ జ్యూస్‌ను తయారు చేసేందుకు గాను ముందుగా యాపిల్‌ను కట్ చేసి మధ్యలో వేరు చేయాలి. ఆ తరువాత కీరదోస, క్యారెట్‌, బీట్‌రూట్‌లను కట్ చేసి వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే దానిమ్మ గింజలు కూడా వేయాలి. ఈ మొత్తం పదార్థాలను కూడా మిక్సీ పట్టి జ్యూస్ తీయాలి. ఇక ఈ జ్యూస్‌ను కనీసం 21 రోజుల పాటు తాగాల్సి ఉంటుంది. దీంతో చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. అయితే అలర్జీలు ఉన్నవారు కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే దీన్ని తాగాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: