రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. అందువల్ల దీంతో గాయాలు, చిన్న చిన్న దెబ్బలను నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మార్చడంలో రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. కళ్ల  కింద నలుపును,కళ్ల వాపులను తగ్గిస్తుంది. సన్ బర్న్ అయితే ఆ ప్రదేశంలో కొంత రోజ్ వాటర్ను  ప్రతి రోజు రాస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై ఏర్పడే మచ్చలను, మొటిమలను తొలగిస్తుంది.ఏవైనా చిన్న చిన్న జీవులు,కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్ రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.కళ్లకు వేసుకునే మేక్అప్ ను రోజ్ వాటర్ తో  చాలా సులభంగా తొలగించవచ్చు. రోజ్ వాటర్, జోజోబా, ఆయిల్ను సమ భాగాలుగా తీసుకొని... కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత గుడ్డతో తుడిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు ఉన్నా, చర్మం దురదగా ఉన్నా.. ఆ ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటిని రాయాలి. ఇది ఇరిటేషన్ ను తగ్గిస్తుంది.  ఇంకా జాస్మిన్ ఆయిల్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి.. శరీరానికి రాస్తే బాడీ నుంచి వెలువడే దుర్వాసన కూడా తగ్గుతుంది పరిశుభ్రంగా ఉంచుతుంది .ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేయాలి. 


ఇలా చేస్తే కళ్ల కింద వాపు, డార్క్ సర్కిల్స్, కళ్ల కింద నలుపు లాంటివి తగ్గుతాయి. దీని కోసం ఒక కాటన్ బాల్న రోజ్ వాటర్ లో ముంచి వలయాకారంలో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దనా చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా, అందంగా మారుతుంది. తాజా కీరదోసని రసంగా చేసి  దాంట్లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి కొంచెం పచ్చి పాలు కలిపి ఫ్రిజ్లో 15 నిమిషాలు ఉంచాలి.తర్వాత అందులో దూది ముంచి ముఖాన్ని తుడిస్తే మురికి పోతుంది. ఇది సహజమైన టోనర్లా పనిచేస్తుంది.చర్మం పీహెచ్ను రోజ్ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. దీంతోపాటు చర్మం జిడ్డుగా మారకుండా చేస్తుంది. చుండ్రు నివారణకు రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కేశాల సంరక్షణకు బాగా పని చేస్తుంది.రోజ్ వాటర్,అలోవెరా జెల్ని సమాన భాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు  బాగా పట్టించాలి. తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆపై  ఒక అరగంట వదిలేయాలి బాగా ఆరేవరకు. తర్వాత షాంపూతో  శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా నెలకు మూడు లేదా నాలుగుసార్లు చేస్తే కుదుళ్లు దృఢంగా, బలంగా మెరుస్తుంటాయి.పువ్వుల్లో గులాబీలది ప్రత్యేక స్థానం. అయితే, వీటిని అనేక రకాల సౌందర్యసాధనాల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. అంతేకాదు గులాబీలతో తయారు చేసే రోజ్వాటర్ కూడా చర్మ సౌందర్యానికే కాకుండా జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: