ఇంటి నుండి బయటకు వచ్చిన కాసేపట్లోనే మొహం చెమటల కారణంగా జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారికి  ముఖం ఇంకా ఎక్కువ జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. ఇక ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఆఫీస్ కి వెళ్ళే దాకా కూడా ముఖం ఫ్రెష్ గా ఉండడం లేదు. ఎండల తాకిడికి ముఖం పొడి పారిపోవడంతో పాటు చర్మం పై మొటిమలు, నల్ల మచ్చలతో ముఖం కాంతి హీనంగా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లో మన ముఖంలోని కాంతిని  మళ్ళీ తిరిగి తీసుకురావడానికి.. ఒక దివ్య ఔషధం ఉంది. అది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అదే టమాట. టమాటా లోని లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన ముఖానికి  ఒక మంచి సన్ స్క్రీన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. టమాటా వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అదే టమాటా కి ముఖాన్ని మృదువుగా, కాంతివంతంగా, సున్నితంగా, అందంగా చేయగల శక్తి కూడా ఉంది. టమాటా ని స్కిన్ కేర్ లో భాగంగా ఏన్నో విధాలుగా వాడొచ్చు. టమాటో గుజ్జు ను ముఖం మీద  వారానికి ఒక సారి అప్లై చెయ్యొచ్చు. దానివల్ల మొటిమలు, నల్ల మచ్చలు చాలా త్వరగా తగ్గిపోయి ముఖాన్ని మరింత అందంగా మారుస్తుంది.


బయట పార్లర్ లో అనేక రసాయణాలు కలిపినా ఫేసియల్, ఫేస్ ప్యాక్ చేయించుకోవడం కన్నా మన ఇంట్లో నాచురల్ గా టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ను తయారు చేసుకొని వేసుకోవడం వల్ల.. అందులో ఉండే విటమిన్ సి మన ముఖాన్ని కాంతివంతంగా వెలిగిపోయేలా చేస్తుంది.ఇక టమాటాను క్రమం తప్పకుండా ప్రతి రోజు మొహానికి రాసుకోవాలి. దానివల్ల ముఖం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా టమాటా గుజ్జు ఎక్స్ఫోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. టమాటాను రెండు చెక్కలుగా కట్ చేసి, అందులో ఒక ముక్క మీద  కోంచెం చక్కెర చల్లి.. దాన్ని సున్నితంగా ముఖం మీద నెమ్మదిగా మర్దన చేయాలి. దీనివల్ల ఆ టమాటాలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి మన చర్మం లోపలికి వెళ్లి అందాన్ని పెంచి మరింత రెట్టింపు చేస్తాయి.అంతేకాకుండా టమాట జ్యూస్ తాగడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. టమోటాలో ఉండే లక్షణాలు మనలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య ఛాయలను రాకుండా కూడా నివారిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో టమాటాలను తినడం వల్ల కూడా.. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కూరల్లో టమాటా ను వేసుకోవడం లేదా.. టమాటా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా ఎన్నో సమస్యల భారీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మన చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: