ముఖ్యంగా ఇతర దేశాల అమ్మాయిలతో పోల్చుకుంటే అరేబియన్ అమ్మాయిలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. నల్లగా నిగనిగలాడే ఒత్తైన కురులు, పాలమీగడ లాంటి చర్మం , కలువ రేకుల లాంటి కళ్ళు అబ్బో ఒక్కటేమిటి ఇలా వారి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మరి ఇంతటి అందం వారికి ఎలా సొంతం అయ్యింది.. అదంతా సహజసిద్ధమైన పదార్థాల పుణ్యమే అంటున్నారు ఈ అరేబియన్ మహిళలు.. మరి వారి సౌందర్య రహస్యాలు ఏంటో మనం కూడా ఒకసారి చూద్దాం.

ఆర్గాన్ నూనె..

అరేబియన్ మహిళల సౌందర్య పోషణలో ఆర్గాన్ ఆయిల్ ముఖ్యమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ళ వరకు ప్రతి సౌందర్య చికిత్సలో భాగంగా వారు దీనిని వాడడానికి ఎక్కువగా ఇష్టపడతారట. జుట్టు, చర్మం , గోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి తరచూ ఈ ఆర్గాన్ ఆయిల్ తో మర్దనా చేసుకుంటారట. అంతేకాదు కనుబొమ్మలు,  రెప్పలకు ఉండే వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ నూనె వాడతారని సమాచారం.

అవకాడో..

అవకాడో గుజ్జులో తేనె , నిమ్మరసం, కాస్త కొబ్బరి నూనె కలిపి ప్యాక్ లా  ముఖానికి వేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అవకాడో నూనెతో మసాజ్ చేసుకున్నా  సరే ఫలితం ఉంటుందట.

తేనె..

చర్మం పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండడంలో తేనె ఉపయోగపడుతుంది. చర్మాన్ని మృదువుగా,  కాంతివంతంగా మారుస్తుంది. అరేబియన్ ముద్దుగుమ్మలు కీరదోసరసంలో తేనెను కలిపి ముఖానికి అప్లై చేసుకుంటారట. దీనివల్ల చర్మం మరింత కాంతివంతంగా మారుతుందని వారి విశ్వాసం.


గుడ్డు..

అలాగే గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుందని,  దీంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అరేబియన్ మహిళలు తమ ఒత్తైన కురులు  కోసం గుడ్డుతో పాటు కొబ్బరినూనె,  నువ్వుల నూనె కలిపి జుట్టుకి ప్యాక్ లా  వేసుకుంటారట.

కలబంద..

కలబంద గుజ్జులో పసుపు,  ఆర్గాన్ ఆయిల్ కలిపి చర్మాని కి ప్యాక్ లా  వేసుకుంటే మొటిమలు , మచ్చలు తగ్గి చర్మం నిత్యయవ్వనంగా మెరిసిపోతుంది.

ఇక ఈ చిట్కాలు పాటిస్తారు కాబట్టి అరేబియన్ అమ్మాయిలు అత్యంత సుందరంగా మనకు అగుపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: