ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఫిబ్రవరి 12వ తేదీన ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఈ రోజు జన్మించిన జాతకులు ఎవరో తెలుసుకుందాం రండి....!

 

 చార్లెస్ డార్విన్ జననం : జీవపరిణామ సిద్ధాంత కర్త అయిన చార్లెస్ డార్విన్  1809 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించారు. జీవపరిణామ సిద్ధాంత కర్త అయిన చార్లెస్ డార్విన్... భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనేదాని ఎన్నో పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చార్లెస్ డార్విన్ పేరు తలచుకోగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పరిణామ సిద్ధాంతం. భూమిపైన ఉన్న జీవరాసులు వేటికవే రూపొందినట్లు ప్రజలు నమ్ముతున్న కాలంలో అదంతా  వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఉంటాయి అని పరిశోధనల ద్వారా చార్లెస్ డార్విన్ వెల్లడించారు. వానరుడు నుంచి నరుడు వరకు మానవుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపిన శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్. 

 

 అబ్రహం లింకన్ జననం : ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1819 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించారు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న అబ్రహం లింకన్ ఎంత కార్యదక్షతతో పరిపాలించారు. దురదృష్టవశాత్తు అంతర్యుద్ధం ముగిసిన సమయంలోనే ఆయన మరణించారు. 

 

 స్వామి దయానంద సరస్వతి జననం : అజ్ఞానాంధకారం దారిద్య్రం  అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన గొప్ప ముని స్వామి దయానంద సరస్వతి.ఈయన  1824 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించాడు.  హిందూ ధర్మ శంకుస్థాపనకు నడుంబిగించింది వ్యక్తి . 1857 సంవత్సరంలో స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వామి దయానంద సరస్వతి... ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా కూడా నిలిచారు. అంటరానితనం బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఎంతగానో పోరాటం చేశారు. అంతేకాకుండా ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. 1877 ముంబై నగరంలో మొదటి ఆర్య సమాజం స్థాపించాడు స్వామి దయానంద సరస్వతి. 

 

 సిహెచ్ విద్యాసాగర్ రావు జననం : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకరైన సీహెచ్ విద్యాసాగర్రావు 1942 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించారు. ఉస్మానియాలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తిలో ఎన్నో రోజుల పాటు కొనసాగారు. 

 

 జగపతి బాబు జననం : ప్రముఖ తెలుగు సినిమా నటుడు అయిన జగపతిబాబు తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. జగపతి బాబు పూర్తి పేరు వీరమాచనేని జగపతి చౌదరి.. జగపతి ప్రేక్షకులందరికీ జగపతి బాబు కొసమెరుపు. జగపతి  బాబు 1962 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత అయిన బీవి  రాజేంద్ర ప్రసాద్ కుమారుడు. ఆనాటి చిత్రాల్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్న జగపతి బాబు ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్గా ప్రారంభించారు. ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతూ విలన్ పాత్రకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు జగపతిబాబు. తనదైన వైవిద్యాత్మక  నటనతో ప్రతీ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్ఫుల్గా లీడ్  చేస్తున్నారు జగపతిబాబు. 

 

 

 ఆశిష్ విద్యార్థి జనం : ప్రముఖ సినీ నటుడైన ఆశిష్ విద్యార్ధి  తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రల్లో  సహాయ  నటుడి పాత్రల్లో  నటిస్తూ  ఉంటాడు ఆశిష్ విద్యార్థి. పలు సినిమాలలో కమీడియాన్ గా కూడా నటించారు. సినిమాల్లో తనదైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఆశిష్ విద్యార్థి.

మరింత సమాచారం తెలుసుకోండి: