మార్చ్ 6వ  తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు తెలుగు రచయిత అయిన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1899 మార్చి 6వ తేదీన జన్మించారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఆమె రచనలతో ప్రజలందరిలో స్వాతంత్రోద్యమ కాంక్షను ప్రజల్లో రక్షణ  ఎన్నో రచనలు కూడా అందించారు. 

 

 కల్లూరి వేంకట నారాయణరావు జననం : కవిత్వ వేదిక ప్రముఖుడైన కల్లూరి వెంకట నారాయణరావు 1902 మార్చి 6వ తేదీన జన్మించారు. ఈయన తన పేరుతోనే కాకుండా గుప్త నామాలతో కూడా అనేక రచనలు రాశారు. ఆయన రచనలను పాఠ్యాంశాలను కూడా బోధించేవారు. విద్యార్థి దశ నుంచే విజ్ఞాన చంద్రికా గ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు కల్లూరి వేంకట నారాయణరావు. 

 

 కస్తూరి శివరావు జననం : ప్రముఖ తెలుగు నటుడు నాటకరంగ మరియు సినిమారంగంలో ప్రముఖుడు అయిన కస్తూరి శివరావు 1913 మార్చి 6వ  తేదీన జన్మించారు. తొలి తెలుగు చిత్రపరిశ్రమలోనే తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపబడిన వ్యక్తి  కస్తూరి శివ రావు. తెలుగు సినీ హాస్యనటుల్లో  ప్రముఖులైన రేలంగి రమణారెడ్డి రాజబాబు కన్నా ముందు తరం వాడు కస్తూరి శివ రావు. హాస్య నటులకు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేలా  చేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు 1966వ సంవత్సరంలో మరణించారు. 

 

 గడియారం రామకృష్ణ శర్మ జననం  : మహబూబ్ నగర్ కు  చెందిన సాహితీ వేత్తల్లో  గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖులు.. ఈయన 1919 మార్చి 6వ  తేదీన అనంతపురం జిల్లాలో జన్మించారు. ఈయన రచయితగా సాహితీవేత్తగా ఎంతగానో ప్రసిద్ధి చెందారు. 

 

 కృష్ణకుమారి జననం  : పాత తరం తెలుగు సినీ నటీమణులు ప్రముఖులైన కృష్ణకుమారి 1933 మార్చ్ 6వ  తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు కృష్ణకుమారి. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. 

 

 

 శర్వానంద్ జననం : ప్రముఖ తెలుగు సినీ నటుడు శర్వానంద్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోలు అందరూ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. శర్వానంద్ 1984 మార్చి 6వ తేదీన జన్మించారు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో  ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు శర్వానంద్. జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్ హిట్ మూవీ అయినా 96 తెలుగు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం తాజాగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఇక ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన మరో చిత్రంలో నటిస్తున్నారు శర్వానంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: