మే 9వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి నేడు హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి .
అన్నమయ్య జననం : ప్రముఖ వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు అయినా అన్నమయ్య 1408 మే 9వ తేదీన జన్మించారు. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య. అందుకే అన్నమయ్య పద కవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి పదకవితాశైలికి ఆద్యుడు అన్నమయ్య. అంతకు మించిన గొప్ప వైష్ణవ భక్తుడు అన్నమయ్య. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని అహోబిలంలోని నరసింహ స్వామి ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ ఏకంగా 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. ఇక అన్నయ్యని అవతారపురుషుడు అని శ్రీనివాసుని అవతారంగా పలువురు ప్రశంసిస్తూ ఉంటారు.
గోపాలకృష్ణ గోఖలే జననం : భారత స్వతంత్ర సమరయోధుడు సామాజిక సేవకుడు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన గోపాలకృష్ణ గోకులే 1866 మే 9వ తేదీన జన్మించారు. స్వతంత్ర పోరాటంలో కీలక వ్యక్తిగా ఎన్నో ఉద్యమాలు చేపట్టారు గోపాలక్రిష్ణ గోఖలే. 1885 నుంచి 1905 వరకూ మితవాదులు ప్రాభల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించాడు. ఇక 1952 నుంచి మరణించేవరకు భారత శాసన మండలి సభ్యుడిగా కొనసాగారు ఈయన . బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేఖించకున్నప్పటికీ భారతీయులలో జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఎంతగానో కృషి చేశారు గోపాలకృష్ణ గోకులే.
ఎమ్మెస్ నారాయణ జననం : తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కొసమెరుపు అయినా ఎమ్మెస్ నారాయణ... ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. 1950 ఏప్రిల్ మే 9వ తేదీన జన్మించారు. ఈయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. చిత్ర పరిశ్రమలో అందరూ ఆయనని ఎమ్మెస్ నారాయణ గా పిలుచుకుంటారు. హాస్యనటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 700 సినిమాలలో నటించారు ఎమ్మెస్ నారాయణ. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు ఎమ్మెస్ నారాయణ. అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎమ్మెస్ నారాయణ... శ్రీకాంత్ కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకు ముందుగా సినీ కథా రచయితగా కూడా పని చేసాడు ఎం.ఎస్.నారాయణ. తల్లి ప్రోత్సాహంతో ఎమ్మెస్ చేసే సమయంలో నాటకాలు వేస్తూ ఎన్నో పాత్రలు పోషించారు నారాయణ. 1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు ఎమ్మెస్ నారాయణ. ఇంతకు ముందు ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథలు అందించిన సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.తనదైన మ్యానరిజం తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించారు ఎమ్మెస్ నారాయణ.
కల్పనా రాయ్ జననం : ఆనాటి తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు ఆయన కల్పన రాయి ప్రముఖ తెలుగు హాస్య నటి. ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసిన కల్పనా రాయ్ దాదాపు 430 తెలుగు చిత్రాల్లో నటించింది. సినిమాలో అయినా తనదైన మ్యానరిజం తో ఎంతో మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది కల్పన రాయ్ .
సాయి పల్లవి జననం : ప్రముఖ భారతీయ నటి అయిన సాయి పల్లవి 1992 మే 9వ తేదీన జన్మించారు. తమిళనాడు లో జన్మించిన సాయి పల్లవి తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి అని చేర్చింది. అయితే సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డాన్సర్గా ఎన్నో షో లలో చేసింది. ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో లాంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నది సాయి పల్లవి. ఆ తర్వాత తమిళంలో ప్రేమమ్ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసింది సాయి పల్లవి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో భానుమతి పాత్ర పోషించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎలాంటి పాత్ర పోషించిన తనకు తానుగా డబ్బింగ్ చెప్పుకుని మరింతగా ప్రేక్షకులను ఆకర్శించింది .ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.
విజయ్ దేవరకొండ జననం : ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఒక సహాయ నటుడిగా కెరీర్ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత క్రమక్రమంగా హీరోగా ఎదిగి తన సత్తా చాటి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. కాగా విజయ్ దేవరకొండ 1989 మే 9వ తేదీన జన్మించారు. అర్జున్ రెడ్డి సినిమా తో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు.