మే 10వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి..
జహందీర్ షా జననం : మొగల్ చక్రవర్తి అయిన జహందీర్ షా 1661 మే 10వ తేదీన జన్మించారు. పఈయన స్వల్ప కాలం మాత్రమే రాజ్యపాలన చేశారు. రెండో బహదూర్ షా కుమారుడు జహాందర్ . తండ్రి మరణించిన తర్వాత జహాందర్ షా ఆయన సోదరుడు వారికి వారే చక్రవర్తిగా ప్రకటించుకున్నారూ. ఆ తర్వాత వారసత్వ కలహాలు ఆరంభమయ్యాయి... ఆ తర్వాత జహాందర్ సోదరుడు మరణించడంతో సింహాసనం అధిష్టించాడు జహాందర్ షా.
కొర్రపాటి గంగాధరరావు జననం : నటుడు దర్శకుడు శతాధిక నాటకకర్త సమాజ స్థాపకుడు అయిన కొర్రపాటి గంగాధరరావు 1922 మే 10వ తేదీన జన్మించారు. తెలుగు నాటక సాహిత్యంలో వందకు పైగా నాటకాలు-నాటికలు రచించిన మొదటి రచయిత కొర్రపాటి గంగాధరరావు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేక మంది యువ కళాకారుల నాటక రంగానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కొర్రపాటి గంగాధరరావు. వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులను కూడా అందుకున్నారు. నాటక రంగం గురించి నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలు రచించి నాటకం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు కొర్రపాటి గంగాధరరావు.
సునీత జననం : ప్రముఖ సినీ నేపథ్య గాయని డబ్బింగ్ కళాకారిణి అయిన సునీత 1978 మే 10వ తేదీన జన్మించారు. సునీత చిత్ర పరిశ్రమలో ఎనిమిది సంవత్సరాల కాలంలో సుమారు ఐదు వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. గాయకురాలిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడుతూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు సునీత. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ తమన్నా అనుష్క సౌందర్య జెనీలియా శ్రియ శరన్ జ్యోతిక ఛార్మి నయనతార ఇలా దాదాపుగా అందరు హీరోయిన్లకు గాత్ర దానం చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్గానే కాకుండా ఎన్నో సినిమాల్లో పాటలు పాడుతూ ఒక మంచి గుర్తింపు సంపాదించారు.
నమిత జననం : ప్రముఖ భారతీయ నటి అయిన నమిత సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. 1981 మే 10వ తేదీన జన్మించిన నమిత తెలుగు కన్నడ తమిళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు నమిత. ఇక తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించారు నమిత. చాలా మంది స్టార్ హీరోల తో నటించింది నమిత... ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నమిత హీరోయిన్ గా నటించింది. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో నటించింది నమిత.
శ్రీముఖి జననం : ప్రముఖ నటి బుల్లితెర వ్యాఖ్యాత అయిన శ్రీముఖి 1993 మే 10వ తేదీన జన్మించారు. బుల్లితెర యాంకర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులై సినిమాలో అల్లు అర్జున్ చెల్లి పాత్రల్లో నటించిన శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరపై అదుర్స్ అనే ప్రోగ్రాం యాంకర్ గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది శ్రీముఖి. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి రియాల్టీ షోల తో పాటు సినిమాల్లో కూడా చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.