జూన్ 5వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 


 రావి నారాయణ రెడ్డి జననం : కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ సాయుధ  పోరాటంలో ముఖ్యుడు అయిన రావి నారాయణరెడ్డి 1908 జూన్ 5వ తేదీన జన్మించారు. ప్రముఖ సంఘసంస్కర్త ఉదార ప్రజాస్వామ్యవాది అయిన రావి నారాయణరెడ్డి... ఆంధ్ర మహాసభ ప్రారంభించిన సాంస్కృతికోత్సవాలు క్రమానుగతంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా ఈయనను పేర్కొంటూ ఉంటారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈయన ముందుండి అందరిలో చైతన్యం కల్పిస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు. 1991 సెప్టెంబర్ 7వ తేదీన రావి నారాయణరెడ్డి పరమపదించారు.

 

 మూరేళ్ళ ప్రసాద్ జననం  : ప్రముఖ తెలుగు సినిమా చాయాగ్రాహకుడు అయినా  మూరేళ్ళ ప్రసాద్ 1968 జూన్ 5వ తేదీన జన్మించారు. ఈయన ఎక్కువగా తెలుగు తమిళ సినిమాలకు పనిచేశారు. విజయవాడలో జన్మించిన ఈయన అతని విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. చిన్నప్పటినుంచి సినిమాలో పని చేయాలి అనే ఉత్సాహంతో చదువు పూర్తిచేసిన వెంటనే మద్రాసు వెళ్లి... తొలినాళ్ళలో బాలు మహేంద్ర,  రవి యాదవ్ లాంటి మరికొందరు ఛాయాగ్రాహకులు దగ్గర సహాయకునిగా పనిచేశారు. తన చలనచిత్ర జీవితాన్ని పి సుందర్  దర్శకత్వంలో విడుదలైన   తమిళ సినిమాలో ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీనువైట్ల  దర్శకత్వంలో వచ్చిన వెంకీ  సినిమాతో చాయాగ్రాహకుడు గా తన కెరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత చంటి సినిమా కూడా ఛాయాగ్రహకుడు గా పనిచేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ కూడా పలు సినిమాలకు ఛాయాగ్రాహకుడు గా పని చేస్తున్నాడు. మొన్నటికి మొన్న వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా మల్టీస్టార్ గా తెరకెక్కిన వెంకీ మామ సినిమా కి కూడా మూరేళ్ల ప్రసాద్ ఛాయాగ్రహకుడు గా పని చేశారు. 


రంభ జనం : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన ప్రముఖ నటి అయిన రంభ 1976 జూన్ 5వ తేదీన జన్మించారు. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దర్శకనిర్మాతలను ఆకర్షించిన రంభ ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని  ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రంభ... అద్భుత విజయాలను కూడా అందుకున్నారు. ఇక పలు సినిమాలలో ఏకంగా ఐటమ్ సాంగ్స్ లో కూడా తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదర గొట్టింది  రంభ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా  కొనసాగి... ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

 

 భావన జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి భావన 1986 జూన్ 5వ తేదీన జన్మించారు. భావన ఎక్కువగా మలయాళం తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటించారు. ఇక తాను  నటించిన సినిమాల్లో తనదైన నటనతో ఎంతో గుర్తింపు సంపాదించారు భావన. ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గడంతో ఎక్కడ వెండితెరపై మాత్రం కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: