జూలై 14వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 గరిమెళ్ళ సత్యనారాయణ జననం : స్వతంత్ర సమరయోధులు కవి అయిన  గరిమెళ్ళ సత్యనారాయణ 1893 జూలై 14వ తేదీన జన్మించారు, స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ ది ఒక ప్రత్యేకమైన స్థానం. గరిమెళ్ళ రాసిన గేయాలలో  జాతీయ వీరరసం తొణికిసలాడుతూ ఉంటాయి. దీంతో పాఠక జనాలను  మొత్తం ఆయన గేయాలతో  ఎంతగానో ఉర్రూతలూగించాయి, ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ ఆయన రాసిన పాటలు ప్రజలందరిలో  సరికొత్త ఉత్తేజం నింపాయి . ఓవైపు భారత మాత గొప్పతనం చెబుతూ మరోవైపు తెల్లదొరలను తరిమికొట్టే   నినాదాన్ని రేకెత్తించే విధంగా ఈయన గేయాలు ఉండేవి. ముఖ్యంగా గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాట ప్రతి తెలుగువాడి నోట మారుమోగింది అని చెప్పాలి. కేవలం రచయితగానే కాకుండా గొప్ప నాయకుడిగా తన కంచు కంఠంతో పాటలు కూడా పాడి  ఎంతోమంది లో చైతన్యం కలిగించారు. 


 శంకర్ రావు  చవాన్ జననం : భారత దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శంకర్ చవాన్  1920 జూలై 14వ తేదీన జన్మించారు. ఈయన  మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. భారత రాజకీయాల్లో పలు కీలక పదవులను నిర్వహించారు శంకర్ రావు చవాన్. 2004 సంవత్సరంలో ఈమన  మరణించారు. 

 


 తనికెళ్ల భరణి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రచయిత అయిన తనికెళ్ల భరణి తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తనికెళ్ల భరణి పశ్చిమగోదావరి జిల్లాలో 1956 జూలై 14వ తేదీన జన్మించారు. మొదట్లో తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఎంతగానో  గుర్తించి సంపాదించాడు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందివ్వడమే కాకుండా వైవిధ్యమైన నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించారు. ఒకప్పుడు హాస్యభరితమైన పాత్రలో నటించిన తనికెళ్ల భరణి... ప్రస్తుతం ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పిస్తున్నారు, ఇక దర్శకుడిగా మారి మిధునం అనే సినిమాను కూడా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు తనికెళ్ల భరణి. 

 

 చాగంటి కోటేశ్వరరావు జననం : ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినా చాగంటి కోటేశ్వర రావు  1959 జూలై 14వ తేదీన జన్మించారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గా చాగంటి కోటేశ్వరరావు ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఈయన  చెప్పే ప్రవచనాలు నేటి తరానికి పురాణాల గొప్పతనాన్ని మనసుకు తాకేలా చేస్తూ ఉంటాయి . తమదైన శైలిలో పురాణాలను వివరిస్తూ... ఎంతో గొప్పగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతూ ఉంటాడు చాగంటి కోటేశ్వరరావు. సామాన్య ప్రజలకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్త జన మనసులను దోచుకున్నారు చాగంటి కోటేశ్వరరావు.,

మరింత సమాచారం తెలుసుకోండి: