జులై 15 వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
పి ఏ దాసు పిళ్ళై జననం : భారత స్వతంత్ర సమరయోధులు అయినా పీఏ దాసు పిళ్ళై 1885 జూలై 15వ తేదీన జన్మించారు. తదనంతర కాలంలో 1960 లో కేరళ ముఖ్య మంత్రిగా కూడా పనిచేశారు. కేరళ రాజకీయాల్లో ఎంతో గొప్ప ఒక నాయకుడిగా ఎదిగారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పిఏ దాసు న్యాయవాదిగా పనిచేయడంతో పాటు స్వాతంత్రోద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు, 1928 నుంచి 32 వరకు ట్రావెన్కోర్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు . అంతేకాకుండా 1962 నుంచి 64 కాలంలో పంజాబ్ గవర్నర్గా... 64 నుంచి 68 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా కూడా పనిచేసారు.
చేబియ్యం సోదమ్మ జననం : ఆంధ్ర రాష్ట్రం మొత్తం గర్వపడే స్వాతంత్ర సమరయోధురాలు సంఘసేవకురాలు అయిన సోదమ్మ 1895 జూలై 15వ తేదీన జన్మించారు. పోలవరం గ్రామంలో సురాజ్య ఆశ్రమాన్ని స్థాపించి గిరిజనుల అక్షరాస్యతకు ఎంతగానో కృషి చేశారు. 1920 నుంచి 21 వరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు సోదెమ్మ. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం లో కూడా కీలక పాత్ర వహించారు. 1932లో శాసనాధిక్కారం కేసులో ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇక సంఘసేవకురాలు ఆమె చేసిన సేవలు ఎంతో కొనియాడదగినది అని చెప్పవచ్చు.
దుర్గాబాయి దేశ్ముఖ్ జననం : భారత స్వాతంత్ర సమరయోధురాలు సంఘసంస్కర్త రచయిత న్యాయవాది సామాజిక కార్యకర్త అయిన దుర్గాబాయి దేశ్ముక్ 1909 జూలై 15వ తేదీన జన్మించారు, చెన్నై హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభలకు ఆజ్యం పోసింది దుర్గాబాయి దేశ్ముఖ్. అంతేకాకుండా భారతదేశం యొక్క రాజ్యాంగ సభ భారతదేశం యొక్క ప్రణాళిక సంఘం సభ్యురాలిగా కూడా కొనసాగారు. సంఘసేవకురాలు గా ఆమె ఎంతగానో సేవలు చేశారు, ఉప్పు సత్యాగ్రహం లో ఎంతగానో కీలక పాత్ర పోషించిన దుర్గాబాయి దేశ్ముఖ్ జైలు శిక్ష కూడా అనుభవించారు, అనేక మహిళా సంస్థలు సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. స్త్రీల కోసం ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోమ్ నెలకొల్పారు దుర్గాబాయి దేశముఖ్.
కందాళ సుబ్రహ్మణ్య తిలక్ జననం : స్వాతంత్ర సమరయోధుడు మొదటి లోక్సభ సభ్యుడు అయిన కందాళ సుబ్రహ్మణ్య తిలక్ 1920 జూలై 15వ తేదీన జన్మించారు. ఈయన గాంధీ సిద్ధాంతాలకు ఎంతగానో ఆకర్షితులై స్వాతంత్ర పోరాటంలో చేరారు. స్వాతంత్రోద్యమంలో విజయనగరం జిల్లా నుంచి కీలక పాత్ర పోషించారు. స్వాతంత్రోద్యమంలో పోరాటంలో భాగంగా రెండు సార్లు జైలు జీవితం గడిపారు కందాళ సుబ్రహ్మణ్య తిలక్. ఈయన పోరాటాల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తిలక్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952 లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మొదటి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు,