జూలై 24వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి నేడు జన్మించిన ప్రముఖులు 
ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 

 కేశూభాయి పటేల్ జననం  : గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కేశూభాయ్  పటేల్ 1935 జూలై 24వ తేదీన జన్మించారు.  భారతీయ జనతా పార్టీ కి చెందిన సీనియర్  నాయకులు. గుజరాత్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన... తనదైనా పాలనతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

 

 మొదలి నాగభూషణ శర్మ : ప్రముఖ రంగస్థల నటుడు దర్శకుడు నాటకకర్త అయిన  మొదలి నాగభూషణ శర్మ 1935 జూలై 24వ తేదీన జన్మించారు. విదేశాలలో పర్యటించి వివిధ నాటక ప్రయోగాలపై  అధ్యయనం చేశారు మొదలి  నాగభూషణశర్మ. నాటకమే ప్రధానాంశంగా డాక్టరేట్ ను  అందుకున్నారు నాగభూషణ శర్మ. 

 


 కల్వకుంట్ల తారక రామారావు జననం  : టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 1976 జూలై 24 వ తేదీన జన్మించారు. కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు. అమెరికా ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు కల్వకుంట్ల తారకరామా రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా... తన భాషతో తన భావంతో  ఎంతగానో  తెలంగాణ ప్రజలను ప్రభావితం చేశారు కల్వకుంట్ల తారకరామా రావు . తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి గా ఎన్నుకోబడ్డారు. 

 

 విజయ్ ఆంటోనీ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ప్లేబాక్ సింగర్ నిర్మాత నటుడు విజయ్ ఆంటోని 1975 జూలై 24 వ తేదీన జన్మించారు. మొదటసంగీత దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని ఆ తర్వాత పలు సినిమాల్లో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా తెలుగు తమిళ కన్నడ భాషల్లో  ఎంతగానో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: