ఎస్ఆర్ రంగనాథన్ జననం : భారతదేశ గ్రంథాలయ పితామహుడు అయినా ఎస్ఆర్ రంగనాథన్ 1892 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవం కూడా జరుపుకుంటారు. గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగా ఎన్నికై అనితర సామాన్యమైన కృషి చేశారు ఎస్ఆర్ రంగనాథన్.
విక్రమ్ సారాభాయ్ జననం : భారతదేశ భౌతిక శాస్త్రవేత్త భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు అయిన విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. భౌతికశాస్త్రం లో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలు పెట్టారు.
కేఏ నీలకంఠశాస్త్రి జననం : దక్షిణభారతదేశపు చరిత్రకారులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన నీలకంఠశాస్త్రి 1892 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. ఈయన రాసిన గ్రంథాలు అన్ని చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన ఆధార గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. ఈయన పాండిత్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఏకంగా పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. తమిళనాడు లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నీలకంఠశాస్త్రి... ఎన్నో రచనలను రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రకారులలో అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తిగా కూడా నీలకంఠ శాస్త్రి గుర్తింపు పొందారు.
సుశీల్ కోయిరాలా జననం : నేపాల్ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్ కోయిరాల 1939 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. నేపాల్ దేశానికి 2014 ఫిబ్రవరి 11 నుంచి 2015 అక్టోబర్ 10 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా నేపాల్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందించారు సుశీల్ కొయిరాలా.
సాయెష సైగల్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన సయేశా సైగల్ 1997 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సాయెష సైగల్ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించింది. అటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించింది. 2019 మార్చి 10వ తేదీన తమిళ హీరో ఆర్య ను ప్రేమ వివాహం చేసుకుంది సయేశా సైగల్.