మ‌ణిక‌ట్టు బ్యాటింగ్ స్టైల్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచంలో చ‌రిత్ర‌లు సృష్టించాడు మ‌న హైద‌రాబాదీ  వెరీవెరీ స్పెష‌ల్ ప్లేయ‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. 1996లో టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన వీవీఎస్ లక్ష్మణ్, జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకగా నిలిచాడు. తన మణికట్టు మాయాజాలంతో ఎన్నో అద్భుతాలు చేశాడు. అభిమానులను అలరించాడు. జెంటిల్‌మెన్ గేమ్‌ను అంతే జెంటిల్‌గా ఆడిన క్రీడాకారుడిగా నిలిచాడు. మొత్తం 134 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లక్ష్మణ్ 8781 పరుగులు సాధించాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం కామెంటరీ చేస్తున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఆటో బయోగ్రఫీని వెస్ట్ ల్యాండ్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.



 2001లో జరిగిన కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడిలో ఆస్ట్రేలియా పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమంలో అతడు చాలా కాలం క్రితం సునీల్ గవాస్కర్ సాధించిన 236 (నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.  వీరేంద్ర సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్తో ముల్తాన్లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తాలో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అప్ప‌టివ‌ర‌కు 17 టెస్ట్ మ్యాచుల్లో వ‌రుస‌గా గెలుస్తూ జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న ఆస్ట్రేలియాకు వీవీఎస్ లక్ష్మ‌ణ్ బ్యాటింగ్‌తో, హర్భ‌జ‌న్ సింగ్ బౌలింగ్‌తో నిలువ‌రించారు.



ఆ మ్యాచులో గెల‌వ‌డమే కాదు.. టెస్ట్ సిరీస్‌ను ద‌క్కిచుకోవ‌డం గ‌మ‌నార్హం. ల‌క్ష్మ‌ణ్ కెరీర్‌లోనే ఇది అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌గా చెప్పాలి. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పూర్తి పేరు. వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్  (నవంబర్ 1, 1974).  హైదరాబాదులో జన్మించాడు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌గా అంత‌ర్జాతీయంగా కీర్తిని సాధించాడు. లక్ష్మణ్ 127 టెస్టు మ్యాచ్‌లకు, 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టుకు, ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2008 లో జరిగిన మొట్టమొధటి ఐపిఎల్లో దెక్కన్ ఛార్ర్జెర్స్ జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాదు.2011 లో లక్ష్మణ్ కు పద్మ శ్రీ పురస్కారమ్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: