మంచితనం, మానవత్వం మూర్తిభవించిన స్త్రీ మూర్తి సుధా మూర్తి. ఈరోజు భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విజయవంతమైన మహిళగా సుధా మూర్తి ఎంత మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేను పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
 
సుధా మూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హవేరి, షిగ్గావ్ లో సర్జన్, డాక్టర్, ఆర్ హెచ్ కులకర్ణికి జన్మించింది. అను బాల్యమంతా తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది. బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అందులో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి బంగారు పతకాన్ని అందుకుంది. తర్వాత ఆమె బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది.


కంప్యూటర్ సైంటిస్ట్, ఇంజనీర్ల సుధా మూర్తి తన కెరీర్ను ప్రారంభించారు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి భారతదేశంలోనే అతిపెద్ద ఆటో తయారీదారు, టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీ లో మొదటి మహిళా ఇంజనీర్ గా మారింది. దానికి ముందు ఆమె చేసిన సాహసం తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ వెళ్లేముందు సుధా మూర్తి టెల్కో కంపెనీలో పురుషాధిక్యత, వివక్షత గురించి ఫిర్యాదు చేస్తూ కంపెనీ చైర్మన్ కు లేఖ రాసింది. దాని ఫలితంగా ఆమెను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ వెంటనే డెవలప్మెంట్ ఇంజనీర్ గా నియమించారు. తర్వాత మే పుణేలోని వాల్ చంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో సీనియర్ సిస్టమ్స్ ఎనలిస్ట్ గా చేరింది.

 
ఆ తర్వాత ఆమె అకడమిక్ ఎక్స్లెన్స్ కోసం అనేక అవార్డులు అందుకుంది. 1995లో బెంగళూరు లోని రోటరీ క్లబ్ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా అవార్డు అందుకుంది. 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించింది. నుంచి ఇప్పటి వరకు ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీగా, బెంగుళూరు విశ్వవిద్యాలయం పి జి సెంటర్ లో విజిటింగ్. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సుధా క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ని స్థాపించారు. 2018లో క్రాస్వర్డ్ డైమండ్ బుక్ అవార్డులలో సుధామూర్తి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. కొత్త ఏడాది ఐఐటి కాన్పూర్ ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ప్రదానం చేసింది. ఇక ఆమెలో రచయిత కూడా ఉన్నారు. ఆమె రాసిన ది మదర్ ఐ నెవర్ నో, మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్, ది మాన్ ఫ్రం ది ఎగ్ వంటి బుక్స్ ప్రసిద్ధి చెందాయి. ఆమె కన్నడ చిత్రాలలో కూడా నటించింది. 2019లో ఆమెకు భారత దేశ అత్యున్నత పౌర గౌరవం పద్మశ్రీని ప్రధానం చేసింది.

 
70 ఏళ్ల లో కూడా చురుకుగా ఉంటూ ఆశ, ఆశయం ఉంటే ఏదీ లేదని ఆమె జీవితం చెప్తుంది. ఆల్ రౌండర్ గా ఆమె మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. గ్రామీణ విద్య, పేదరిక నిర్మూలన, పరిశుభ్రత వంటి ఈ విషయాలపై ఆమె అవగాహన కల్పిస్తూ ఉంటారు. సుధా మూర్తి జీవితం ఆదర్శనీయం... ఆమె చేసిన సామాజిక సేవ ఆదర్శప్రాయం. సుధా మూర్తికి "ఇండియా హెరాల్డ్" తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: