యువ సంచలనం గాయకుడు గురు రాంధవా పుట్టిన రోజు నేడు. ఆయన గాయకుడు మాత్రమే కాదు పాటల రచయిత, సంగీత స్వరకర్త కూడా. శ్రీ కృష్ణ పుట్టిన రోజు జన్మదినం రోజునే పుట్టిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గురు అసలు పేరు గుర్షరంజోత్ రాంధవా. ఆయనకు తల్లిదండ్రులు బోహేమియా గురువు పేరు పెట్టారు. 2012లో అదే పేరు మీద గురు సంగీత ప్రయాణం మొదలు పెట్టాడు. గురు ముందుగా గురుదాస్ పూర్ లో చిన్న ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో చిన్నచిన్న పార్టీలలో సింగింగ్ మొదలుపెట్టాడు. ముందుగా ఆయన అర్జున్ తో కలిసి పాడిన పాట పెద్దగా ఆడలేదు.

ఈ సింగర్ శ్రేయోభిలాషి టీ-సిరీస్‌ను గురుని లాంచ్ చేయమని కోరారు. దీని తర్వాత ఈ కాంబోలో "పటోలా" పాటను తీశారు. అది సూపర్ హిట్ అయ్యింది. గురు ఇప్పటి వరకు "లాహోర్, పటోలా, హై రేటెడ్ గాబ్రూ, సూట్, బంజ మేరి రాణి, ఇషారే తేరే, ఫ్యాషన్ ప్రైవేట్ సాంగ్స్ చేశారు. ఆ ఆల్బమ్స్ అన్ని అద్భుతమైన విజయం సాధించాయి.

2018 సంవత్సరంల, అతను టైమ్స్ మోస్ట్ వాంటెడ్ మెన్ జాబితాలో 23వ స్థానంలో నిలిచారు. అతి కొద్దీ సమయంలోనే ఇంతటి పాపులారిటీని సొంతం  చేసుకున్నాడు. 2019 లో అతను చండీగఢ్ టైమ్స్ ది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు.  2020లో ఆరవ స్థానంలో ఉన్నాడు.

2018 సంవత్సరంలో గురు సల్మాన్ ఖాన్ "దబాంగ్" రీలోడెడ్ టూర్‌లో భాగం అయ్యాడు. గాయకుడు పిట్బుల్‌తో పాడిన మొదటి అంతర్జాతీయ పాట 24 గంటల్లో యూట్యూబ్ లో 38 మిలియన్ వ్యూస్ పొందింది. ఆ సమయంలో ఈ పాట 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన పాటలలో ఇది ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: