బాలీవుడ్ ప్రతిభావంతులైన నటులలో పంకజ్ త్రిపాఠీ ఒకరు. ఆయన స్టార్ డమ్ ను అందుకోవడానికి ముందు తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. అలాంటి సమయంలోనూ అతని భార్య ఎప్పుడూ చేయి విడవలేదు. పైగా ఆయనకు తనవైపు నుంచి మంచి సహకారం అందించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి నటుడిగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న పంకజ్ లవ్ స్టోరీ నిజంగానే ఏ సినిమా స్టోరీకి సరిపోదు. అంత అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది ఈ నటుడి జీవితంలో. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ లవ్ స్టోరీపై మనమూ ఓ కన్నేద్దాం.

1993లో పంకజ్ తన సోదరి వివాహంలో మృదులను కలుసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "నా సోదరి పెళ్లి చేసుకుంటోంది. నేను మృదులాను బాల్కనీలో చూశాను. ఆమెను చూడగానే నా జీవితాంతం ఈ అమ్మాయితోనే గడపాలి అన్పించింది. ఆ సమయంలో ఆమె ఎవరో, ఆమె పేరు ఏమిటో నాకు తెలియదు" అని చెప్పుకొచ్చారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ఆ తరువాత పంకజ్, మృదుల 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు డేటింగ్ చేశారు. 2004లో వివాహం చేసుకున్నారు. చాలా కష్టాల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కుటుంబాలు వారి వివాహానికి వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.

ఆ సమయంలో పంకజ్ వరకట్నం తీసుకోలేదు. ఆ గ్రామంలో ఒక అబ్బాయి వరకట్నం తీసుకోకపోవడం అదే మొదటిసారి. పంకజ్ మృదులాను కలిసినప్పుడు ఆమె కోల్‌కతాలో నివసిస్తోంది. ఢిల్లీలో చదువుతోంది. ఆ సమయంలో డేటింగ్ అంత సాధారణం కాదని, కలవడం కూడా అంత సులభం కాదని పంకజ్ అన్నాడు. "మేము మా అభిప్రాయాలను లేఖల ద్వారా ఒకరికొకరం తెలుపుకునేవాళ్ళం. 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసుకునే వాళ్లం. కాల్ మాట్లాడడానికి మేము పెట్టుకున్న సమయం రాత్రి 8 గంటలు. ఇక పంకజ్ కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఎదుర్కొనేటప్పుడు కూడా ఆమె అతనికి మద్దతుగా నిలిచింది.

పంకజ్ చివరిగా "మిమి" చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో పంకజ్ నటనపై ప్రశంసలు కురిశాయి. పంకజ్ నెక్స్ట్ 83, బచ్చన్ పాండే, ఓ మై గాడ్ 2 చిత్రాలలో కన్పించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: