డ్యాన్స్ క్వీన్ శ్రియ శరణ్
శ్రియ శరణ్ ఢిల్లీలో తన విద్యను పూర్తి చేసింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్ భట్ నగర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో టీచర్, తల్లి నీర్జా శరణ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్. శ్రియ మాత్రం చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనుకుంది. అందుకే అంతకన్నా ముందే డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధించింది. ఆమె 2001లో బెనారస్‌లో వీడియో షూట్ చేసి తన నట జీవితాన్ని ప్రారంభించింది.
ఒకేసారి నాలుగు సినిమాలు
రేణు నాథన్ 'తిర్కటి క్యున్ హవా' మ్యూజిక్ వీడియోలో డాన్స్ చేసి అద్భుతమైన నైపుణ్యం కనబర్చిన శ్రియకు గొప్ప అవకాశం వచ్చింది. కెమెరా ముందు శ్రియ చేసిన తొలి ప్రదర్శన ఇదే. ఇక్కడే శ్రియను అదృష్టం వరించింది. ఆమె 'ఇష్టం' చిత్రం కోసం రామోజీ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో శ్రియ ఒకేసారి నాలుగు సినిమాలకు సంతకం చేసింది.
రజనీకాంత్ సినిమా ద్వారా గుర్తింపు
అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. శ్రియ 2003 బాలీవుడ్ చిత్రం 'తుజే మేరి కసం' లో కనిపించింది. తర్వాత 2004లో "తోడ తుమ్ బడ్లో తోడ హమ్" అనే చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. రజనీకాంత్ 'శివాజీ ది బాస్' నుండి శ్రియకు నటిగా అద్భుతమైన గుర్తింపును పొందింది. ఈ సినిమా విజయం ఆమెకు 'ఉత్తమ తమిళ నటి' అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
బహిరంగ క్షమాపణ చెప్పవలసి వచ్చింది!
శ్రియ సినిమాలతోనే కాకుండా వివాదాల్లోనూ నిలిచింది. 'శివాజీ ది బాస్' సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో ఆమె పొట్టి, లో నెక్ తో ఉన్న తెల్లని దుస్తులతో కనిపించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. శ్రియ పొట్టి దుస్తులపై రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి శ్రియ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
రహస్యంగా పెళ్లి
శ్రియ తన రష్యా ప్రియుడు ఆండ్రీ కోష్చెవ్‌ని రహస్యంగా వివాహం చేసుకుంది. వీరి వివాహానికి అత్యంత్య సన్నహితంగా ఉన్న వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆమె తన భర్తతో చాలా సంతోషంగా ఉంది.