బాలీవుడ్ సింగర్ మోనాలీ ఠాకూర్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మోనాలీ సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శక్తి ఠాకూర్, సోదరి మెహులీ ఠాకూర్ బెంగాలీ సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ వ్యక్తులు. మోనాలీ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. "ఇండియన్ ఐడల్ 2"తో మోనాలీ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

తండ్రి పాపులర్ అయినప్పటికీ కూడా బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడానికి మోనాలీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత మోనాలీ 2008లో "రేస్" చిత్రంలో "జర జర టచ్ మి", 'ఖ్వాబ్ దేఖే' అనే రెండు పాటలను పాడారు. ఈ రెండు సాంగ్స్ ఆమెకు మ్యూజిక్ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చాయి. రెండు పాటలూ హిట్‌ కావడంతో మోనాలీ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు. ఈ రో, మోనాలీ పుట్టినరోజు సందర్భంగా మీ కోసం ఆమె పాడిన టాప్ 5 సాంగ్స్ చూద్దాము.

మోహ్-మోహ్ కే ధాగే
'దమ్ లగా కే హైషా' చిత్రంలోని ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన వెంటనే అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ పాటకు మోనాలీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ క్రేజ్ నేటికీ అలాగే ఉంది.



చం చం
శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బాఘీ' చిత్రంలోని ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే కాదు ఇది స్పెషల్ రెయిన్ సాంగ్ లా మారింది. ఈ పాటలో మోనాలీ స్వరం అద్భుతం సృష్టించింది.

 

సవార్ లూన్
సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్ నటించిన 'లూటేరా' చిత్రంలోని ఈ పాట చాలా క్యూట్‌గా ఉంది. ఈ పాట 60, 70ల నాటి వైబ్‌లతో శ్రోతలను యిట్టె ఆకర్షిస్తుంది ఈ పాటకు మోనాలీ ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.

అగా బాయి
రాణి ముఖర్జీ చిత్రం 'అయ్యా'లోని అగా బాయి పాట రాణికే కాదు మోనాలీకి కూడా టర్నింగ్ పాయింట్. మోనాలీకి ఈ పాట కుడి అద్భుతమైన ఫేమ్ ను సంపాదించి పెట్టింది. అంతేకాదు ఇప్పటికి కూడా ఈ పాట DJలో వింటున్నారు జనాలు.



బద్రీ కి దుల్హనియా
'బద్రీనాథ్ కి దుల్హనియా' చిత్రంలోని ఈ పార్టీ సాంగ్ ప్రతి హోలీకి మారు మ్రోగాల్సిందే. పాటలో మోనాలీ స్వరం అద్భుతంగా ఉంటుంది.

 

మోనాలీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఆమె 2017 సంవత్సరంలో రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె భర్త స్వీడిష్ రెస్టారెంట్ యజమాని. మోనాలీ తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటోంది. ఆమె తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: