
దేశంలో కరోనాని అరికట్టడానికి డాక్లర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతగా కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పోలీసు లు అయితే వారి కుటుంబ సభ్యులకు దూరంగా కరోనా వ్యాప్తి ఉన్నా ధైర్యంతో తమ సేవలు కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ ని పటిష్టంగా అమలు జరిగేలా చూస్తున్నారు. తాజాగా పోలీసులు అందిస్తున్న గొప్ప సేవపై రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని స్టార్ హీరో మహేశ్ బాబు కితాబిచ్చాడు.
కరోనాపై యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. దీంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలు షేర్ చేశాడు. తాజాగా మహేష్ బాబు ట్విట్ పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో మీరు చేసిన వ్యాఖ్యలు పోలీసుల నిబద్ధతను మరింత బలపరుస్తాయని అన్నారు.
సమాజ సేవలో భాగం కావడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. దేశంలో కరోనా ని పూర్తిగా అరికట్టే బాధ్యత ప్రతి పౌరుడికీ ఉందని... ఈ క్లీష్ట సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పపడకుండా ఉండాలని అన్నారు. సమస్యల్లో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి ఒక ప్రశంస, ఒక చిరునవ్వు చాలని అన్నారు.
Certainly your words will strengthen our morale @ this crisis & it made us feel proud being in #ServiceToTheSociety. A word of appreciation is enough, a smile on receiving face is enough,for everyone whoever is risking their lives to save someone from risk. #WeShallOvercomeCorona https://t.co/E2s0Pnh6A3
— DGP telangana police (@TelanganaDGP) April 9, 2020