
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేదకు రూ. 5000/- ఆర్ధిక సహాయం అందించాలని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇదే అంశంపై భీమడోలులోని తన ఇంట్లోనే నిరసన దీక్షకు దిగారు. వరి .. మొక్కజొన్న మరియు ఇతర పంటలను పండించే రైతుల వద్ద ఉన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే వారికి నగదు జమ చేసేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలన్నారు. అలాగే ఆక్వారంగం కుదేలు కాకుండా.. వరికి ప్యాకేజీ ఏర్పాటుచేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా పై పోరాటంలో సేవ చేస్తున్న వైద్యులకు, శానిటరీ వర్కర్లకు, పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు సైతం రు. 5 వేలు ఇవ్వాలన్నారు. ఉదయం 6 గంటలకే పై డిమాండ్లతో దీక్ష ప్రారంభించిన గన్నికి మద్దతుగా పలువురు పార్టీ నేతలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరి ఇళ్లలోనే వారు దీక్షకు దిగడం విశేషం. ఉదయం గన్ని దీక్షను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ పుష్పమాల వేసి ప్రారంభింపజేసారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా గన్ని నిరసన దీక్షకు మద్దతుగా స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ అభ్యర్థులు, పలువురు కీలక నేతలు కూడా ఎవరి ఇళ్లల్లో వారే నిరసన దీక్షకు దిగడం విశేషం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple