కొద్దిసేపటి క్రితం కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్యులపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితులలోను సహించమని అన్నారు. దాడి తీవ్రతను బట్టి దాడి చేసిన వారికి ఆరు నెలల నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్టు ప్రకటన చేశారు. 
 
దాడి చేసిన వారికి జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. విధుల్లో ఉన్న అన్ని రకాల వైద్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా ఉంటుందని ప్రకటన చేశారు. ఈరోజు ప్రధానంగా దేశ ఆర్థిక స్థితి, లాక్ డౌన్ ప్రభావం, కరోనా నియంత్రణ గురించి చర్చ జరిపినట్లు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: