తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 943కు చేరింది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు నమోదైన కేసులలో జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 10, సూర్యాపేటలో 3, గద్వాల్ లో 2 కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో అధిక సంఖ్యలో కేసులు హైదరాబాద్ నగరంలో, సూర్యాపేటలోనే నమోదవుతూ ఉండటం గమనార్హం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరొకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 24కు చేరింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసినా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
 
కొత్త కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో ఈరోజు 56 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 813కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: