విక్టరీ వెంకటేష్ బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ అభిమానులకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ మరికొంతమందిని నామినేట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజమౌళి ఛాలెంజ్ ను జూనియర్ పూర్తి చేసి విక్టరీ వెంకటేష్ తో పాటు మరికొంతమందిని నామినేట్ చేశారు. 
 
ఛాలెంజ్ ను స్వీకరించిన వెంకటేష్ ఈరోజు ఇంట్లో బండలు తుడుస్తూ... మొక్కలకు నీళ్లు పోస్తూ... గుబురుగా పెరిగిన మొక్కలను కట్ చేస్తూ... కూరగాయలను కట్ చేసి వంట వండి ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇంటి పనుల్లో ప్రతి ఒక్కరూ సహాయపడాలని పిలుపునివ్వడంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిని నామినేట్ చేశారు. మహేష్ బాబును చిన్నోడు అని, వరుణ్ ను కోబ్రా అని పిలుస్తూ నామినేట్ చేయడం గమనార్హం. 
 
వెంకటేష్ విసిరిన ఛాలెంజ్ పై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సెలబ్రీటీలు ఛాలెంజ్ ను పూర్తి చేస్తూ మరొకరిని నామినేట్ చేస్తూ అభిమానులకు ఇంటి పనుల్లో సహాయం చేయాలని పిలుపునిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: