స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగ్ అశ్విన్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తనకు జీవితాంతం గుర్తిండిపోయే పాత్రను మహానటి సినిమాలో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కీర్తి సురేష్ తన పోస్ట్ లో ఎల్లప్పుడూ కూల్ గా, ఫన్నీగా, విచిత్రంగా, క్రేజీగా ఉండే ప్రతిభావంతమైన దర్శకుడు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 
 
తన హృదయంలో ఊహించే దానికంటే ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారని అన్నారు. నా వంతుగా నేను గొప్పగా చెప్పడానికి ప్రయత్నించానని ఏవైనా కామెంట్లు ఉన్నాయా...? అని పేర్కొన్నారు. రాబోయే మంచిరోజులకు చీర్స్ అంటూ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో కీర్తి సురేష్ పోస్ట్ చేశారు. 2018 సంవత్సరం మే 9వ తేదీన విడుదలైన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. 
 
అప్పటివరకు కీర్తి సురేష్ ను గ్లామర్ హీరోయిన్ గానే గుర్తించిన ఇండస్ట్రీకి మహానటి సినిమా ఆమెలోని గొప్ప నటిని పరిచయం చేసింది. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: