హీరో నాగార్జున కెరీర్‌లో శివ‌మ‌ణి సినిమాకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ సినిమాకు అప్ప‌ట్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక యూత్‌ను ఒక ఊప్ఊపేసింది. ఇక శివ‌మ‌ణి సినిమాలోని డైలాగ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌న‌లేదు. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నాగ్ ఇర‌గ‌దీశాడు. అయితే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్నిమ‌నం కాపాడుకోవ‌డానికి మాస్క్‌లు ధ‌రించాల‌ని, సామాజిక‌దూరం పాటించాలంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, ముఖ్య‌మంత్రులు ప‌దేప‌దే చెబుతున్నారు. అయినా కొంద‌రు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేదు.

 

మాస్క్‌లు లేకుండా బ‌య‌ట తిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం మిమిక్రీ ఆర్టిస్ట్‌ భ‌విరి ర‌వి శివ‌మ‌ణి చిత్రంలోని పూర్ణా మార్కెట్ సీన్‌ను తీసుకుని నాగ్ డైలాగ్స్‌కు మిమిక్రీ చెప్పారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో నాగ్ వాయిస్‌ను అచ్చుగుద్దిన‌ట్లు దించారు. నా పేరు శివ‌మ‌ణి. పూర్ణా మార్కెట్ ఏరియా స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ని.. మాస్క్‌లు లేకుండా ఎందుకు బ‌య‌ట తిరుగుతున్నార్రా.. అంటూ చెప్పే డైలాగ్స్ సూప‌ర్బ్ గా ఉన్నాయి. ఇక దీనిపై నాగ్ స్పందించారు. పూరి జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఇప్పుడు శివ‌మ‌ణి సినిమా చేస్తే.. డైలాగ్స్ ఇలాగే ఉంటాయంటూ ట్వీట్ చేశారు. దీనిపై పూరి స్పందించారు. సూప‌ర్ స‌ర్ అంటూ ట్వీట్ చేశారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: