పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఇంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉ న్న ఆయన తాజాగా వకీల్‌సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నారు. కాగా వకీల్‌సాబ్ చిత్రం ఇప్పటి కే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మే లోనే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో తా త్కాలికంగా విడుదల తేదీని నిలిపివేశారు.
షూటింగ్ మెదలైనప్పటి నుంచే వకీల్ సాబ్ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమాపై రకరకాల గాసిప్స్ కూడా వచ్చాయి. తాజాగా వకీల్‌సాబ్‌పై మరో వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఏమిటంటే, ఈ చిత్రాన్ని సంక్రాంతి లేదా రిపబ్లిక్ ది నోత్సవం సందర్భంగా రాబోయే సంవత్సరంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే పవన్ అభిమానులకు మరికొంత కాలం నిరాశ తప్పదు. వకీల్‌సాబ్ కోసం వారు వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సందే.