కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ తన క్యూటెస్ట్ డాటర్ అర్హతో ఇంట్లో వర్కవుట్స్ చేశారు. అల్లుఅర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా ఖాతాలో వర్కవుట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉదయం అల్లు అర్జున్ తన కూతురితో ఎక్సర్ సైజ్ చేస్తూ లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ అల్లు అర్హకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అల్లు అర్జున్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను, విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
గతంలో కూడా అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటలో దోసె స్టెప్ అంటూ అర్హ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.