వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకుల విమర్శలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మీడియాలో కనిపించడం వల్ల వారికి ఆత్మసంతృప్తి లభిస్తుందేమో కానీ జనాల్లో సానుభూతి, అభిమానం పెరగడానికి ఏ మాత్రం పనికిరాదని అన్నారు. 
 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాక ముందే హామీలన్నీ నెరవేరుస్తోందని... 80 శాతం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను గెలుచుకున్న అధికార పక్షం ప్రజల మధ్య నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అధికార పక్షం ఇచ్చిన హామీలన్ని నెరవెరుస్తుంటే ఎల్లో మీడియాను పట్టుకుని ఊగులాడితే ఏమొస్తుందని చంద్రబాబును, ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. 
 
గత కొన్ని రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలు వైసీపీపై, విజయసాయిరెడ్డిపై ఏదో ఒక విషయంలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: