గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా ఆస్పత్రికి ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. అలా చేస్తే తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టు అవుతుందని చెప్పారు. 
 
ఈ మేరకు తెలంగాణ ప్రజల నుంచి చంద్రబాబుకు అభ్యర్థనలు వెళుతున్నాయని అన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబరిచాలని సూచించారు. చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ ను కరోనా ఆస్పత్రికి ఇస్తే ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ ను కరోనా ఆస్పత్రికి ఇవ్వకపోతే ఎన్టీఆర్ ఆత్మ ఎలా శాంతిస్తుందని అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
మరి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. విజయసాయి ట్విట్టర్ వేదికగా సూచనలు చేస్తూ తన ట్వీట్ల ద్వారా చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: