సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కృషి వల్ల కరీంనగర్ లోని మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు వచ్చాయి. కాళేశ్వరం జలాలు రైతులకు సిరులు కురిపించాయి. గత రెండేళ్లలో జిల్లాలో సాగు విస్తీర్ణం... దిగుబడి పెరిగిందని అధికారుల సర్వేల్లో వెల్లడైంది. కాళేశ్వరం జలాలు అందిన ప్రాంతాల్లో ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. 
 
కాళేశ్వరం జలాలు అందిన ప్రాంతాల్లో రైతులు వరి పంటను ఎక్కువగా పండించారు. కాళేశ్వరం జలాల రాకతో పంటలు బాగా పండటంతో రైతులు ఆనందంగా కనిపిస్తున్నారు. కాళేశ్వరం జలాల వల్ల రైతు ఆర్థిక స్థితిగతుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. వేసవికాలంలో కూడా బావులు, చెరువులు నిండటంతో భూగర్భజలాలు భారీగా పెరిగి రైతులు పంట కోత ప్రయోగాల్లో పెరిగిన దిగుబడులు స్పష్టంగా కనిపించాయి. 
 
గతంలో ఎండిన పంటలు కనిపించే ప్రాంతాల్లో ధాన్యం సిరులతో నిండిన పొలాలు కనిపించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న కేసీఆర్ పై రైతులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: