తెలంగాణ పార్టీ కేసీఆర్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఅర్ అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు ఉదయం 9.30 గంటల సమయంలో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. 
 
సీఎం కేసీఆర్ తో పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే పార్టీ వేడుకలు కరోనా వల్ల నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. పార్టీ కార్యకర్తలు నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. పలు చోట్ల పేదలకు, వలస కార్మికులకు నేతలు ఆహరం అందజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: